ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు: 'మా విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి' - Kodali Nani comments on Grain procurement

ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు. రైతులకు నగదు మొత్తాన్ని ఆన్​లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన కల్లం వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేయడం గర్వకారణమని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

ధాన్యం కొనుగోలు
ధాన్యం కొనుగోలు

By

Published : May 19, 2021, 5:33 PM IST

కొవిడ్ పరిస్థితుల వల్ల ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఇప్పటివరకు 1,66,814 కూపన్లు జారీ చేశామని, కూపన్​లో నిర్ణయించిన తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది రైతు కల్లం వద్దకు వెళ్లి కాంటా వేసి మిల్లుకు తరలిస్తారని వివరించారు. కాంటా వేసిన తరువాత కొనుగోలు రశీదును అందజేస్తారని, ధాన్యం అమ్మిన రైతుకు రసీదులో ఇచ్చిన నగదు మొత్తాన్ని ఆన్​లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వివరించారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా, క్షేత్ర స్థాయిలో 20 కొనుగోలు కేంద్రాలకు ఒక పర్యవేక్షణాధికారిని నియమించామని మంత్రి కొడాలి నాని తెలిపారు. ప్రతి రైతుభరోసా కేంద్రంలో తేమ శాతం పరీక్షించడానికి మాయిశ్చర్ మీటర్​లు ఏర్పాటు చేశామన్నారు. 2020-21 సంవత్సరం పంటకాలానికి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు. ఇప్పటివరకు 1,15,813 రైతుల వద్ద నుంచి 2,510 కోట్ల రూపాయల విలువ చేసే 13.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.

మే 31వ తేదీలోగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్న అంచనాతో... ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు. ఇందుకు వరి పంటకు సంబంధించి 7,706 రైతుభరోసా కేంద్రాలను 3,936 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేశామన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా 3,01,540 రైతుల వివరాలను ధాన్యం కొనుగోలు కోసం నమోదు చేశామని చెప్పారు. రైతుకు సంబంధించిన భూమి, పంట సాగు వివరాలను ఆన్​లైన్ ఈ క్రాప్(ఈ-పంట) సర్వీస్ ద్వారా నమోదు చేయించి... ధాన్యం కొనుగోలు సమయంలో వివరాలు సరిపోల్చి, కొనుగోలు చేయటం ద్వారా దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామన్నారు.

ప్రభుత్వం చేపట్టిన కల్లం వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేయడం గర్వకారణమని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రైతు వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుల వద్ద మర పట్టించి సోర్టెక్స్ చేయించగా వచ్చిన నాణ్యమైన బియ్యంను మాత్రమే సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు అందించే విధంగా ఉత్తర్వులు ఇచ్చామని కొడాలి నాని తెలిపారు.

ఇదీ చదవండీ... 2020 - 21 ఆర్థిక సర్వే ప్రతిని విడుదల చేసిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details