క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయమన్న ఆయన... విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణపూర్వక అనుబంధాలను మేలుకొలిపే సందర్భమని చెప్పారు.
ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి యేసు క్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం తాను కూడా క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని.. సాంఘిక దూరాన్ని పాటించటం, ముఖ ముసుగును ధరించటం, తరచుగా చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా పండుగను జరుపుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.