అంకితభావంతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుందాం స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంకితభావంతో నిర్వహించుకుందామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. 73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛా ఫలాలను ఆస్వాదించటానికి.. దేశభక్తులు ఎంతో కృషిచేశారన్నారు. ఒక్కసారి వారందరినీ స్మరించుకోవాలని సూచించారు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం లాంటి గొప్ప ఆదర్శాలకు పునరంకితం కావాలన్నారు.
గవర్నర్ తేనీటి విందు
తొలిసారిగా రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయవాడలోని రాజ్భవన్లో గురువారం మధ్యాహ్నం 3గంటల 15 నిమిషాలకు గవర్నర్ తేనీటి విందు ఇవ్వనున్నారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు రానున్నారు. విందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. గవర్నర్ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అతిథులంతా మధ్నాహ్నం 2 గంటల 45 నిమిషాలకే వారికి కేటాయించిన స్థానాలలో ఉండాలని సూచించారు.
ఇది కూడా చదవండి
పర్యటకులను కట్టిపడేస్తున్న తుంగభద్ర