జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి చిన్నారికి సురక్షితమైన నీటిని అందించేలా చూడాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలను ఉద్దేశించి చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రాధాన్యతను అందరూ గుర్తించాలని కోరారు. జల్జీవన్ మిషన్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సంబంధిత విభాగాల కార్యదర్శులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రతి చిన్నారికి సురక్షిత మంచినీరు అందాలి : గవర్నర్ బిశ్వభూషణ్ - chief secretary neelam sahni
జల్జీవన్ మిషన్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా... గవర్నర్ బిశ్వభూషణ్ దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి చిన్నారికి రక్షిత మంచినీటిని అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని గవర్నర్ ఆదేశించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాలపరిమితితో కూడిన ప్రచారాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, జల, పారిశుద్ధ్య కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాల సహకారంతో... అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీలలో వంద రోజుల కార్యక్రమం’ అమలు చేయాలని సూచించారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. రక్షిత నీటిని అందించడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇదీచదవండి.