ఆపత్కాలంలో ప్రజలను ఆదుకుంటున్న రెడ్‌క్రాస్ శత వార్షికోత్సవం వరకూ విజయవంతంగా రావడానికి కార్యకర్తల నిస్వార్ధ సేవానిరతే కారణమని రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలో రెడ్‌క్రాస్ సొసైటీ శతవార్షిక ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీ ముగింపు వేడుకల్లో రాజ్‌భవన్ నుంచి దృశ్య, శ్రవణ మాధ్యమంలో గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల నుంచి మార్చి 16న ప్రారంభించిన సైకిల్ ర్యాలీ విజయవాడ చేరుకోవడం అభినందనీయమని.. ఇందులో పాల్గొని యువత, వాలంటీర్లు తమ సేవా తత్పరతను చాటారని గవర్నర్ ప్రశంసించారు. శత వార్షికోత్సవాలు జయప్రదం చేయడంలో అన్ని జిల్లాల ఛైర్మన్లు, కార్యదర్శులు మంచి చొరవ చూపారని రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ విభాగం ఛైర్మన్ డాక్టరు ఎ.శ్రీధరరెడ్డి అన్నారు. కరోనా సమయంలో రెడ్‌క్రాస్ మంచి సేవలందించిందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సీఈఓ ఎ.కె.ఫరీడా, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సంయుక్త కలెక్టరు మోహనరావు తదితరులు పాల్గొన్నారు.