వేగంగా మారుతున్న వాతావరణ పరిస్ధితులను మెరుగుపరిచి, కాలుష్యాన్ని నివారించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ ఉసిరి, తులసి మొక్కలు నాటారు. ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కలు భారతదేశానికి ప్రాముఖ్యమైనవని, వాటిని వాతావరణ మార్పుల వల్ల అంతరించి పోకుండా కాపాడాలని కోరారు. వ్యక్తిగతంగా తనకు మొక్కల పెంపకం పట్ల మంచి ఆసక్తి ఉందని, ఏ కార్యక్రమానికి వెళ్లినా తాను మొక్కలు నాటేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తానని గవర్నర్ తెలిపారు. పచ్చదనం పెంపునకు దోహద పడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారని, ప్రజలు స్పందించి మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జున రావు పాల్గొన్నారు.
మొక్కలు నాటండి.. వాతావరణాన్ని కాపాడండి: గవర్నర్ - Governor Plantation news in telugu
కాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్ద ఎత్తున మెుక్కలు నాటాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గవర్నర్ రాజ్ భవన్ ప్రాంగణంలో ఉసిరి, తులసి మొక్కలు నాటారు.
governor-plantation-at-raj-bhavan