శాసన సభ, మండలి సమావేశాలు ప్రోరోగ్ చేస్తూ.. గవర్నర్ నిర్ణయం - assembly council prorog latest news update
శాసన సభ, శాసన మండలి సమావేశాలను ముగిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల ఏడు నుంచి సమావేశాలు ప్రోరోగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
సమావేశాలు ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం
శాసన సభ, శాసన మండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 7 నుంచి ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపారు. శాసన సభ, మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడిన తర్వాత నిబంధనల ప్రకారం ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గవర్నర్ సమావేశాలు ముగిసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.