ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో గవర్నర్ పర్యటించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అక్కడి రైతులతో కాసేపు మాట్లాడారు. సేంద్రీయ సాగు విధానాలు... ఎదురవుతున్న ఇబ్బందులు, ఆదాయ-వ్యయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ అభిప్రాయాలను గవర్నర్తో పంచుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయానికి తోడ్పాటు అందిస్తున్నాయని గవర్నర్ వివరించారు.
ఆదాయ-వ్యయాలు ఎలా ఉన్నాయి..?: గవర్నర్ - కృష్ణా జిల్లా పర్యటనలో గవర్నర్
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి... స్థానిక రైతులతో మాట్లాడారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్