కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగించాలే తప్ప... దీనివల్ల ప్రభావితమైన వ్యక్తులతో కాదని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులతో సహ జీవనం చేయడం తప్ప ప్రస్తుతానికి వేరే ప్రత్యామ్నాయం లేదనేది అంతా గుర్తుంచుకోవాలని రేడియో సందేశంలో పేర్కొన్నట్లు రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి: గవర్నర్ - ఏపీలో కరోనా కేసులు
ప్రజలంతా తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అందరూ పోరాటం కొనసాగించాలన్నారు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. అన్ని జాగ్రత్తలను పాటిస్తూ..ప్రతి ఒక్కరూ కరోనా కట్టడిలో పాలు పంచుకోవాలని కోరారు.
ప్రస్తుతం అనవసరమైన ప్రయాణాలను నివారించడం, శారీరక దూరాన్ని పాటించటం, బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో తరచుగా చేతులు కడుక్కోవడం చేయాలని గవర్నర్ సూచించారు ఈ చర్యల వల్ల కరోనాను నివారించటం సాధ్యమవుతుందని- కావున వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి మన దేశం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోందని... ఈ వైరస్ వ్యాప్తి వల్ల కలిగే నష్టం అనేక రంగాలపై ప్రభావం చూపిందన్నారు. ఈ వైరస్ నివారణ వ్యాక్సిన్ కనుగొనే పరిశోధనలు చాలా దేశాలలో జరుగుతున్నప్పటికీ, టీకాకు కొంత సమయం పడుతుందని... సమీప భవిష్యత్తులో పూర్వపు సాధారణ స్థితిని పునరుద్ధరించుకోలేక పోయినా, పరిశ్రమలు, ఇతర రంగాలు నెమ్మదిగా తమ కార్యకలాపాలను ప్రారంభించడం తప్పనిసరి అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా వైరస్ కట్టడికి అవసరమైన వ్యాక్సిన్ వచ్చే వరకు మన జీవన క్రమానికి అవసరమైన సాధారణ కార్యకలాపాలను కొనసాగించడం కోసం ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు. కరోనా వైరస్‌తో సంబంధం ఉన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే కాల్‌సెంటర్‌లో వైద్య నిపుణులను సంప్రదించాలని... సొంతంగా మందులు వాడొద్దని సూచించారు.
ఇదీచూడండి.లాక్డౌన్ అనంతరం సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతి