ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒలింపియాడ్ విజేత జట్టుకు బిశ్వభూషణ్‌ అభినందన

ప్రతిష్ఠాత్మక ఒలింపియాడ్​లో విజేతగా నిలిచిన భారత జట్టుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ అభినందనలు తెలిపారు. ఈ విజయం భారతీయులందరికీ గర్వకారణమన్నారు.

governor biswabhusan
governor biswabhusan

By

Published : Aug 31, 2020, 7:23 PM IST

ఫిడె చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారులను ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. పసిడి పతకం సాధించడం దేశానికికే గర్వకారణమన్నారు. క్రీడాకారులు విశ్వనాథన్‌ ఆనంద్‌, హంపి, హారిక, హరికృష్ణకు అభినందనలు తెలిపారు. చదరంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో రష్యాతో కలిసి భారత్‌ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 93 ఏళ్ల చెస్‌ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. భారత్‌ను విజేతగా నిలపడంలో కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు.

ABOUT THE AUTHOR

...view details