బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నివాళులు అర్పించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధునిగా, దూరదృష్టి గల నాయకునిగా బాబు జగ్జీవన్ రామ్ దేశ సేవలో తరించారని కీర్తించారు. రాజకీయ మేధావిగా దేశ అభివృద్ధికి ఆయన అందించిన సహకారం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు.
బాబు జగ్జీవన్ రామ్ నిజమైన ప్రజాస్వామ్యవాది అని ప్రశంసించారు. సమాజంలోని పేద, అణగారిన, బలహీన వర్గాలను ఉద్ధరించడానికి పోరాడారన్నారు. 35 సంవత్సరాలకే కేబినెట్ మంత్రిగా దేశానికి సేవలందించి, సంస్కరణల అమలులో తనదైన ముద్రను చూపారన్నారు. దేశంలో హరిత విప్లవం అమలు చేయటంలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు.