ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దాది హృదయ మోహిని మృతికి సంతాపం ప్రకటించిన గవర్నర్

దాది హృదయ మోహిని మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేశారు. 8 ఏళ్ల వయసులో బ్రహ్మ కుమారి సంస్ధలో చేరిరని తెలిపారు. ఆధ్యాత్మిక భావన, ఆత్మ చైతన్యం, ధ్యానం, సాధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారని కొనియాడారు.

By

Published : Mar 12, 2021, 7:43 PM IST

Published : Mar 12, 2021, 7:43 PM IST

Governor Bishwabhushan Harichandan
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం

బ్రహ్మకుమారి సంస్ధ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రాజయోగి దాది హృదయ మోహిని ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 8 ఏళ్ల వయసులో బ్రహ్మ కుమారి సంస్ధలో చేరిన దాది హృదయ మోహిని చేరినట్లు ఆయన తెలిపారు. సంస్థ సేవలో తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆధ్యాత్మిక భావన, ఆత్మ చైతన్యం, ధ్యానం, సాధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారని వివరించారు. నమ్మిన సిద్దాంతం కోసం రాజయోగిని దాది హృదయ మోహిని తన జీవితాన్ని అంకితం చేశారన్న గవర్నర్​.. బ్రహ్మ కుమారి సంస్థ సభ్యులకు సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details