కరోనా వ్యాక్సినేషన్ తొలివిడత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్యారోగ్య శాఖ అధికారులు, వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ అభినందించారు. తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియడారు. రాష్ట్రంలో తొలివిడత టీకా పంపిణీలో కృషి చేసిన వారిని గవర్నర్ అభినందించారు. ఈ మేరకు రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.
అధికారులకు, శాస్త్రవేత్తలకు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ తొలివిడత కార్యక్రమం విజయవంతంగా జరిగింది. టీకా పంపిణీలో కృషి చేసిన వైద్యఆరోగ్యశాఖ అధికారులు, వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలను గవర్నర్ అభినందించారు.
అధికారులకు, శాస్త్రవేత్తలకు గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు