ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉచిత విద్యుత్​ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు: శైలజానాథ్ - apcc chief sailajanath news

సంస్కరణల పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ఉచిత విద్యుత్​పై కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని తప్పుబట్టారు.

Sailajanadh
Sailajanadh

By

Published : Sep 3, 2020, 5:46 PM IST

ఉచిత విద్యుత్​పై ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటల్లో నిజాయతీ కనిపించడం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్​పై కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. ఉచిత విద్యుత్ పథకంలో ప్రభుత్వమే నేరుగా డిస్కంలకు ఎందుకు చెల్లింపులు చేయకూడదని ప్రశ్నించారు.

సంస్కరణల పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని శైలజానాథ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కానుకను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. డిస్కంలను ప్రైవేటీకరిస్తే ఉచిత విద్యుత్ పథకాన్ని తీసివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కంల ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి

వచ్చే ఏప్రిల్ నుంచే విద్యుత్ నగదు బదిలీ అమలు

ABOUT THE AUTHOR

...view details