Government Solve The Problems Of Municipal Workers And Employes: ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా నేటికీ అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని మరచిపోయారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజయవాడ ధర్నా చౌక్ లో రిలే దీక్ష చేపట్టారు.
'నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం, ఇక తప్పదు' - 27వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె
Vijayawada Dharna Chowk Workers Strike: తమ సమస్యలపై ఇప్పటికే అనేక సార్లు మంత్రులు, అధికారులతో చర్చలు జరిపినా సమస్యలకు పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 21వ తేదీ లోపు తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. డిసెంబర్ 14వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. లేకుంటే డిసెంబర్ 21 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే జగన్ను గద్దె దింపుతామని ఆయన హెచ్చరించారు.