'జానపద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి' - కృష్ణా జిల్లా జానపద కళాకారుల వార్తలు
జానపద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘం అధ్యక్షుడు దార్ల ఏసుపాదం విజ్ఞప్తి చేశారు.

'జానపద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి'
కృష్ణా జిల్లాలోని జానపద కళాకారులు తమను ఆదుకోవాలని కోరుతూ... తమదైన పద్ధతిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం హయాంలో తమకు బకాయిలు రావాలని... లాక్ డౌన్ వల్ల కార్యక్రమాలు లేక అర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దార్ల ఏసుపాదం తమను ఆదుకోవాలని కోరారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో తామంతా కళా బృందాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.