ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణపై.. ఆర్​బీకేలకూ కమీషన్ - రైతు భరోసా కేంద్రాలు

పంట ఉత్పత్తుల కొనుగోళ్ల బాధ్యతను రైతు భరోసా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా చేస్తామంటూ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.

పంట ఉత్పత్తుల కొనుగోళ్ల బాధ్యతను ఆర్బీకేలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
పంట ఉత్పత్తుల కొనుగోళ్ల బాధ్యతను ఆర్బీకేలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

By

Published : Apr 29, 2021, 4:00 AM IST

పంట ఉత్పత్తుల కొనుగోళ్ల బాధ్యతను రైతు భరోసా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్​ను నిబంధనల ప్రకారం రైతు భరోసా కేంద్రాలకు చెల్లించేలా ప్రభుత్వ నిర్ణయించింది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా చేస్తామంటూ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా వైఎస్సార్ రైతు భరోసా, సున్నవడ్డీ, పంట రుణాలు, పంటల భీమా, ఇ-క్రాప్ రిజిస్ట్రేషన్ , కౌలు రైతు కార్డుల జారీ లాంటి కీలకమైన పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇలాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను కూడా పారదర్శకంగా చేపట్టగలవని ప్రభుత్వం పేర్కోంది. ప్రస్తుతం పంట కోనుగోలు చేస్తున్న ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల తరహాలోనే ఆర్బీకేలకు నిబంధనల ప్రకారం కమిషన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి

సిబ్బంది, అర్చకుల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలి: మంత్రి వెల్లంపల్లి

ABOUT THE AUTHOR

...view details