ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ నిర్వాకం: 20 రోజులుగా జైలులో 86 మంది ఎస్సీ ఖైదీలు

By

Published : Nov 15, 2020, 10:41 PM IST

జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల 86 మంది ఎస్సీ ఖైదీలు 20 రోజుల నుంచి చిత్తూరు సబ్ జైల్లో మగ్గుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా యనమలమంద గ్రామంలో ఎస్సీ బాలికకు వివాహం చేశారనే నెపంతో స్థానిక ఎస్సై ఓ యువకుడిని చావబాదారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం :  86 మంది ఎస్సీ ఖైదీలు 20 రోజులగా..
ప్రభుత్వం నిర్లక్ష్యం : 86 మంది ఎస్సీ ఖైదీలు 20 రోజులగా..

చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ నిర్వాకం వల్ల ఖైదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. యనమలమంద గ్రామంలో ఎస్సీ బాలికకు వివాహం చేశారనే నెపంతో స్థానిక ఎస్సై ఓ యువకుడిని చితకబాదారని మండిపడ్డారు.

జైలు పాలు చేశారు..

బాధితుడ్ని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించిన 25 కుటుంబాలకు చెందిన 86 మంది ఎస్సీలను జైలు పాలు చేశారని ధ్వజమెత్తారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరిగినా ఆయన నోరెత్తడం లేదని ఎద్దేవా చేశారు.

అక్కడ ట్రంప్​.. ఇక్కడ జగన్..

జగన్ ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలు దర్జాగా బయట తిరుగుతుంటే, ఎస్సీలు మాత్రం జైళ్లలో మగ్గుతున్నారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్ల జాతీయుల ఆగ్రహం చవి చూసిన ట్రంప్ మాదిరే సీఎం జగన్ కూడా ఎస్సీల ఆగ్రహం చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : దేశంలో కరోనా తగ్గుముఖం- ఈ గణాంకాలే నిదర్శనం !

ABOUT THE AUTHOR

...view details