కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఉల్లిపాలెం - భవానీపురం మధ్య కృష్ణానదిపై నిర్మించిన వంతెనకు అంబటి బ్రాహ్మణయ్య పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. క్యాంప్ బెల్ కెనాల్ బ్రాంచ్‌పై నిర్మించిన ఈ వారధికి తెదేపా మాజీ ఎమ్మెల్యే అంబటి పేరు పెట్టాలని.. మంత్రి పేర్ని, ఎమ్మెల్యే రమేష్ బాబు సిఫార్సు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉల్లిపాలెం-భవానీపురం వంతెనకు తెదేపా మాజీ ఎమ్మెల్యే పేరు - ఉల్లిపాలెం భవానీపురం వంతెనకు అంబటి బ్రాహ్మణయ్య పేరు
మంత్రి పేర్ని, ఎమ్మెల్యే రమేష్ బాబు సిఫార్సుల మేరకు.. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్మించిన వంతెనకు ప్రభుత్వం తెదేపా నేత పేరు పెట్టింది. ఉల్లిపాలెం - భవానీపురం మధ్య కృష్ణానదిపై నిర్మించిన వంతెనకు.. అంబటి బ్రాహ్మణయ్య పేరును ఖరారు చేసింది.
ఉల్లిపాలెం భవానీపురం వంతెన, ఉల్లిపాలెం వంతెనకు అంబటి బ్రాహ్మణయ్య పేరు