మహిళా ఆర్థిక స్వావలంభన కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పనకు చర్యలు చేపట్టింది. నేడు 14 ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార ఒప్పందాలు చేసుకోనుంది. మంత్రుల కమిటీ సమక్షంలో ఎంఓయూలపై అధికారులు సంతకాలు చేయనున్నారు. గత ఏడాది 3 లక్షల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధి కల్పించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది చేయూత, ఆసరా పధకాల ద్వారా మహిళలకు రూ.11 వేల కోట్లు అందించామన్నారు. వ్యాపార, స్థిర ఆదాయ మార్గాల్లో పెట్టుబడిగా ఈ సొమ్ము వెచ్చించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
ఆరు లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పనకు చర్యలు - minister peddireddy updates
మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేడు 14 ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార ఒప్పందాలు చేసుకోనుంది. గత ఏడాది 3 లక్షల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధి కల్పించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ap govt logo