ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటికి రూ.1,477 కోట్ల వినియోగానికి పంచాయితీరాజ్ శాఖకు అనుమతి - తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.1,477కోట్లను వినియోగించేందుకు పంచాయితీరాజ్ శాఖకు అనుమతి

రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పులివెందుల, ఉద్దానం, డోన్ నియోజకవర్గాల్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.1,477కోట్లను వినియోగించేందుకు పంచాయతీరాజ్ శాఖకు అనుమతి లభించింది.

Government measures for construction of drinking water projects
పంచాయితీరాజ్ శాఖకు అనుమతి

By

Published : Mar 11, 2021, 6:08 PM IST

తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నీటి సరఫరా ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.1,477కోట్లను వినియోగించేందుకు పంచాయతీరాజ్ శాఖకు అనుమతినిచ్చింది. పులివెందుల, ఉద్దానం, డోన్ నియోజకవర్గాల్లో ఈ నిధుల్ని వెచ్చించనున్నారు. ఉద్దానంలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు కోసం రూ.700కోట్లు, పులివెందులకు రూ.480కోట్లు, కర్నూలు జిల్లా డోన్​లో రూ.297కోట్లు ఖర్చుపెట్టనున్నారు. ఉద్దానం, పులివెందులలో తాగునీటి ప్రాజెక్టులకు 15వ ఆర్ధిక సంఘం గ్రాంట్ల ద్వారా 500కోట్లను, జల్ జీవన్ మిషన్ ద్వారా మరో 340కోట్లను వెచ్చించనున్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా సమీకరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details