ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 27, 2023, 9:22 PM IST

ETV Bharat / state

'కారుణ్య నియామకాలలో ప్రభుత్వం తీరు సరిగా లేదు'

AP JAC AMARAVATHI PROGRAM: రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య నియామకాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా.. కొవిడ్ సమయంలో మరణించి.. కారుణ్య నియామకం పొందని కుటుంబాలను జేఏసీ నేతలు పరామర్శించారు.

ap jac amaravathi program
కారుణ్య నియామకం పొందని కుటుంబాలను పరామర్శించిన జేఏసీ నేతలు

AP JAC AMARAVATHI PROGRAM: కారుణ్య నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం నిమిత్తం ఏపీ ఐకాస రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా కొవిడ్ సమయంలో మరణించి.. కారుణ్య నియామకం పొందని ఉద్యోగుల కుటుంబ సభ్యులను సోమవారం జేఏసీ నేతలు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు మరణించారని, యనమలకుదురుకు చెందిన జాస్తి రవికుమార్ ఆర్టీసీలో డ్రైవర్​గా విధులు నిర్వహిస్తూ చనిపోయారని తెలిపారు. ఉద్యోగానికి సంబంధించి రవి కుమార్ కుటుంబ సభ్యులకు అర్హత ఉందన్నారు. కారుణ్య నియామకంలో ఉద్యోగం కల్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు మాత్రం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు చాలానే ఉన్నాయని చెప్పారు. ఏపీ ఐకాస అమరావతి ఆధ్వర్యంలో కారుణ్య నియామాకాల కోసం పోరాటం చేస్తామన్నారు.

"కొవిడ్ సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని అన్నారు. కానీ గత మూడు సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ కుటుంబాలను ఇప్పుడు మేము సందర్శిస్తున్నాము. వారి వివరాలను సేకరించి ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని వచ్చి.. వారికి న్యాయం జరిగేలా చేయాలని మేము కోరుతున్నాం" - ఈశ్వర్, ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్

కరోనా కారణంగా ఇంటి పెద్దను కోల్పోయామని మృతుడు రవి కుమార్ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తాము చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కళాశాల ఫీజులు చెల్లిస్తున్నామని రవికుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలని అధికారులను కొరడం జరిగిందని, వారు కాలయాపన చేస్తున్నారని పెర్కొన్నారు. ఇల్లు గడవడం కూడా కష్టంగా మారిందని అంటున్నారు.

"మా నాన్న ఆర్టీసీలో పనిచేసేవారు. అయితే 2021లో కొవిడ్ సోకి మా నాన్న చనిపోయారు. ఆర్టీసీ చుట్టూ తిరిగితే.. ఆయన జాబ్ నాకు ఇస్తానన్నారు గానీ ఇంకా ఇవ్వలేదు. మా కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ఇప్పుడు ఉద్యోగం చాలా అవసరం. నా కాలేజ్ ఫీజును కూడా నేను పార్ట్​ టైం జాబ్ చేస్తూ కట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రభుత్వం మాపై దయతలచి జాబ్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము." - శశాంక్, మృతుడి కుమారుడు

ABOUT THE AUTHOR

...view details