ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ ఆస్పత్రుల్లో 32వేల810 డోసులు రెమెడీసీవీర్ నిల్వ ఉంది' - Oxygen supply news

ఆక్సిజన్ 341 మెట్రిక్ టన్నులను కేంద్రం కేటాయిచిందని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం లిక్విడ్ ఆక్సిజన్ వస్తోంది దాన్ని, పూర్తిగా వినియోగం అవుతుందా లేదా బ్లాక్ కు తరలి పోతుందా అన్న అంశాన్ని పర్యవేక్షిస్తామన్నారు

'ప్రభుత్వ ఆస్పత్రుల్లో 32వేల810 డోసులు రెమెడీసీవీర్ నిల్వ ఉంది'
'ప్రభుత్వ ఆస్పత్రుల్లో 32వేల810 డోసులు రెమెడీసీవీర్ నిల్వ ఉంది'

By

Published : Apr 27, 2021, 4:55 AM IST

రాష్ట్రానికి ఆక్సిజన్ 341 మెట్రిక్ టన్నులను కేంద్రం కేటాయిచిందని....వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.ప్రస్తుతం లిక్విడ్ ఆక్సిజన్ వస్తోందని అది పూర్తిగా వినియోగం అవుతుందా లేదా........ బ్లాక్‌కు తరలిపోతుందా అనే అంశాన్ని పర్యవేక్షిస్తామన్నారు. చాలా చోట్ల ఆక్సిజన్‌ వృధా అవుతున్నట్టు గుర్తించామన్న ఆయన దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 32వేల810 డోసులు రెమెడీసీవీర్ నిల్వ ఉందని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి స్పష్టంచేశారు. అవసరం ఉంటేనే ఈ ఇంజెక్షన్ వాడాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు సూచించామన్నారు. ఈ కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని డిజి డ్రగ్స్ ను అదేశించారు. డిశ్చార్జ్ ప్రోటోకాల్ సరిగా పాటించక పోవడం వల్ల ఆపత్రుల్లో పడకల కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. కోవిడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి వేగంగానే నిర్ణయం తీసుకుంటున్నామని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details