ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 11, 2023, 8:45 PM IST

ETV Bharat / state

Cluster Reserve Mobile Teacher: ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఊరట.. క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్

Cluster Reserve Mobile Teacher: ఏకోపాధ్యాయ పాఠశాలల్లో క్లస్టర్ రిజర్వుడు మొబైల్ టీచర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుడు సెలవులో ఉన్న సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవటం వల్ల బోధనాపరంగా ఆయా పాఠశాలల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకే క్లస్టర్ రిజర్వుడు మొబైల్ టీచర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Etv Bharat
Etv Bharat

Cluster Reserve Mobile Teacher: ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనా ఇబ్బందులను దూరం చేసేందుకు క్లస్టర్ రిజర్వుడు మొబైల్ టీచర్ (సీఆర్ఎంటీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవటం వల్ల బోధనా పరంగా ఆయా పాఠశాలల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యను పరిష్కరించేందుకే క్లస్టర్ రిజర్వుడు మొబైల్ టీచర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియచేసింది.

పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు... ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది లేకుండా క్లస్టర్ రిజర్వుడు మొబైల్ టీచర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాలేని పరిస్థితుల్లో క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్ వ్యవస్థలో ఒకరు ఆయా పాఠశాలలకు హాజరవుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా కారణాల వల్ల ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు హాజరు కాలేని పరిస్థితుల్లో విద్యా బోధనకు ఇబ్బంది అవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పొరుగునే ఉన్న పాఠశాలల నుంచి డెప్యుటేషన్ ద్వారా ఉపాధ్యాయుల కేటాయింపు ఫలితాలను ఇవ్వటం లేదని ప్రభుత్వం వెల్లడించింది.

క్లస్టర్ రిసోర్సు పర్సన్స్ స్థానంలో... ఏకోపాధ్యాయ పాఠశాలల్లోని ఉపాధ్యాయుడు సెలవు పెట్టిన సందర్భాల్లో ఎంఈఓ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గుర్తించినట్టు తెలిపింది. 2000 సంవత్సరంలోనూ క్లస్టర్ రిసోర్సు పర్సన్స్పేరిట ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలియచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,489 క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ పని చేస్తున్నట్టు తెలిపింది. తద్వారా 220 చొప్పున ఏడాదికి 7,67,580 ఉపాధ్యాయుల పని రోజులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. సమాచార లోపం కారణంగా క్లస్టర్ రిసోర్సు పర్సన్ వ్యవస్థ సక్రమంగా పని చేయలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఎంఈఓ 1, 2లు, వాలంటీర్ల వ్యవస్థ పాఠశాలల్లోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేసింది.

ఉపాధ్యాయుల సెలవుల కారణంగా.. రాష్ట్రంలోని 9602 ఏకోపాధ్యాయ పాఠశాలకు గానూ ప్రతీ ఉపాధ్యాయుడు కనీసం 22 రోజుల పాటు సెలవు తీసుకుంటే మొత్తంగా 2,11,244 రోజుల సెలవులు అవుతున్నాయని వెల్లడించింది. ఈ కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు గానూ క్లస్టర్ రిజర్వుడ్ మొబైల్ టీచర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియచేసింది.ప్రతీ సీఆర్ఎంటీ 3-4 పాఠశాలలను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల మొబైల్ హాజరు యాప్ లోనూ సీఆర్ఎంటీ పేరు వచ్చేలా మార్పులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details