మొహర్రం నిర్వహణకు సంబంధించి కోవిడ్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 20 న జరగాల్సిన మొహర్రం సందర్బంగా పాటించాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ మైనారిటీ సంక్షేమశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు అడుగుల భౌతికదూరం పాటించటంతో పాటు మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు ఆలంలను పీర్లచావిడి వద్ద ఏర్పాటు చేయడానికి పది మందిని మాత్రమే వినియోగించాలని సూచించింది. మసీదులో 30 నుంచి 40 మంది మాత్రమే భౌతికదూరం పాటిస్తూ ప్రార్ధనలు నిర్వహించవచ్చని పేర్కోంది. పీర్లు చావిడి వద్ద శానిటైజర్లు సరిపడినంత అందుబాటులో ఉంచాలి. అదే సమయంలో ఆర్కెస్ట్రాలు, సన్నాయి మేళాలు, ఏర్పాటు చేయకూడదని తెలిపింది. సంప్రదాయబద్దంగా ఏర్పాటు చేసే అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఉచిత మంచినీళ్ల స్థాళ్లు ఏర్పాటు చేయకూడదని వెల్లడించింది. ఈ నిబంధనలను మొహరం సందర్భంగా ఖచ్చితంగా పాటించేలా అన్ని విభాగాల అధిపతులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తూ మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి మహ్మద్ ఇలియాస్ రిజ్వీ ఉత్తర్వులు ఇచ్చారు.
మొహర్రం నిర్వహణకు ప్రభుత్వ మార్గదర్శకాలు - మొహర్రం తాజా వార్తలు
మొహర్రం నిర్వహణకు సంబంధించి కోవిడ్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 20 న జరగాల్సిన మొహర్రం సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ మైనారిటీ సంక్షేమశాఖ ఉత్తర్వులు ఇచ్చింది
ఏపీ ప్రభుత్వం