ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనకు(Agitation) దిగారు. దీనిపై పలుమార్లు సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించామని.. తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
2016 ఉద్యోగాల్లో తాము విధుల్లో చేరామని.. అప్పటి నుంచి తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించలేదని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘ ప్రతినిధి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. సమస్యలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు, సెక్రటేరియట్‌కు వినతి పత్రాలు అందజేసినా.. న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.