ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర అవతరణ దినోత్సవం.. గవర్నర్ సందేశం - పొట్టి శ్రీరాములు వార్తలు

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రజలందరికీి శుభాకాంక్షలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చూపిన పోరాట పటిమ, త్యాగనిరతిని అందరూ అలవాటు చేసుకోవాలన్నారు.

governer Participated  state formation day at vijayawada
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

By

Published : Nov 1, 2020, 1:41 PM IST

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రాష్ట్ర సాధకులు, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయవాడ రాజ్ భవన్​లో అవతరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు చూపిన పోరాట పటిమ, త్యాగనిరతిని అంతా అలవాటు చేసుకోవాలన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన గొప్పనేత అని కొనియాడారు. గవర్నర్ కార్యదర్శి ఎంకె మీనా , రాజభవన్ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details