తమిళనాడులోకి కోయంబేడు మార్కెట్ కరోనా పాజిటివ్ కేసుల అడ్డాగా మారింది. ఆ మార్కెట్ కారణంగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో నమోదైన 36 కేసుల్లో 21 కేసులు కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివచ్చిన వారే అని ప్రభుత్వం తెలియజేసింది. దీంతోపాటు మరో 32 కేసులు పొరుగు రాష్ట్రానికి చెందిన వారివికూడా నమోదయ్యాయి.
గడచిన 24గంటల్లో నెల్లూరులో 15కేసులు, చిత్తూరులో 9కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక కేసు కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారేనని ప్రభుత్వం తెలిపింది. గుంటూరులో 5, కడపలో 2, కృష్ణాజిల్లాలో 2, శ్రీకాకుళంలో 2 పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. ఇక పొరుగురాష్ట్రాలు మహారాష్ట్రకు చెందిన 29మంది, ఒడిశా 2, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒక్కరికి కరోనా పాజిటివ్ సోకినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా ఏపీకి చెందిన 36మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 32మందికి కలిపి 68మందికి కరోనా పాజిటివ్ సోకినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గడచిన 24గంటల్లో నమోదైన ఏపీకి చెందిన 36 కేసులతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2100కు పెరిగింది.