కృష్ణా జిల్లా విజయవాడ నగర పాలక సంస్థ, అమృతహస్తం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 'గోరుముద్ద' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు పాల్గొన్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందించే సహాయంతో పాటు... ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా నిరుపేదలకు అందించడం ఈ గోరుముద్ద కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యే భోజనం వడ్డించారు. రోజూ ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఈ క్యాంటీన్ ద్వారా ఉచితంగా భోజనం అందించనున్నారు.
విజయవాడలో 'గోరుముద్ద' కార్యక్రమం ప్రారంభం - విజయవాడలో గోరుముద్ద ఆహార పంపిణీ వార్తలు
విజయవాడ నగర పాలక సంస్థ, అమృత హస్తం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లో 'గోరుముద్ద' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విజయవాడలో గోరుముద్దతో ఆహార పంపిణీ