నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఏపీ ఎలక్షన్ కమిషనర్గా నియమించాలని గవర్నర్ చెప్పడం శుభపరిణామని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తమ నిర్ణయాలను, చర్యలను కోర్టులు తప్పపడుతున్నా.. ప్రభుత్వానికి జ్ఞానోదయం కావట్లేదని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ పనితీరుపై హైకోర్టు స్పందన చూశాకకూడా.. ప్రభుత్వంలో మార్పులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైకోర్టు చివాట్లు పెడుతున్నా..ప్రభుత్వంలో మార్పురావట్లేదు:గోరంట్ల - తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వార్తలు
తమ నిర్ణయాలను, చర్యలను కోర్టులు తప్పపడుతున్నా.. ప్రభుత్వానికి జ్ఞానోదయం కావట్లేదని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య ఆరోపించారు. పోలీసు వ్యవస్థ పనితీరుపై హైకోర్టు స్పందన చూశాకకూడా.. ప్రభుత్వంలో మార్పులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
gorentla buchaya
ఇష్టారాజ్యంగా చేస్తాం..తాము చెప్పేదే వేదం అన్నట్లుగా.. ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. ప్రతిపక్షం హెచ్చరిస్తున్నా .. పోలీసులు, అధికారులు పద్దతి మార్చుకోవడం లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉందని ధ్వజమెత్తారు. డీజీపీ స్వామిభక్తిలో మునిగి తేలుతున్నారని గోరంట్ల ఎద్దేవాచేశారు.