వైకాపా నేతల పై తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డు, ము, వు, లు ప్రథమా విభక్తి.. చేతన్, చేన్ తృతీయ విభక్తి అని గుర్తు చేస్తూ.. ఈ కోవలోనే కొత్తగా భ, జ, న భక్తి చేరిందని ఎద్దేవా చేశారు. భజన అనేది వైకాపా భక్తి అంటూ ట్వీట్ చేశారు.
భ, జ, న.. వైకాపా భక్తి : గోరంట్ల - అధికార , ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్దం
అధికార , ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా మూడు రాజధానుల విషయంలో తెదేపా నేతలు తమదైన శైలిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైకాపా నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
![భ, జ, న.. వైకాపా భక్తి : గోరంట్ల gorantla comments](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8298906-562-8298906-1596598986759.jpg)
gorantla comments