కరోనా రెండో దశ కట్టడికి ప్రధాని మోదీ తగిన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటమే కారణమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరత, ఆసుపత్రుల్లో సదుపాయాల లేమి ఘటనలతో దేశాన్ని నవ్వులపాలు చేశారని విమర్శించారు.
"మోదీ శిష్యుడైన జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. కరోనా నియంత్రణలో విఫలమై ఎందరో మరణాలకు కారణం అయ్యారు. ప్రకటనలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. వ్యాక్సిన్లకు ఖర్చు చేయలేకపోతుందా?" అని ని గోరంట్ల ఆగ్రహించారు.