తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన అత్యంత పాశవికమని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. మగాళ్ల రూపంలో ఉండే మృగాలు చేసే పని ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 ఏళ్ల బాలికపై 4 రోజుల పాటు ఏడుగురు రాక్షసులు అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేశారని, ఇలాంటి వారిని శిక్షించి ఆడ బిడ్డలకి భరోసా కల్పించాలని గోరంట్ల డిమాండ్ చేశారు.
ఆ రాక్షసులను శిక్షించాలి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనను తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండించారు. నిందితులను శిక్షించి ఆడ బిడ్డలకి భరోసా కల్పించాలని ట్విటర్ ద్వారా డిమాండ్ చేశారు.
మైనర్ బాలికపై అత్యాచార ఘటన దారుణమన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి