పెట్రోలియం ఉత్పత్తులపై యూరప్ దేశాలలో 65 శాతం వరకు పన్నులు వేస్తుండగా.. మన దేశంలో 260 శాతం వరకు పన్ను విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. సామాన్యుల ప్రయాణ సాధనమైన రైలు చార్జీలను కూడా అమాంతంగా పెంచడమే కాకుండా ఆ చర్యను సమర్థించుకుంటున్న తీరు వింతగా ఉందన్నారు.
ఓటు వేసే ముందు ఓ సారి ఆలోచించుకోవాలి
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు ఓటు వేసే ముందు ఓ సారి ఆలోచించుకోవాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్ ప్రసాద్ కోరారు. రాష్ట్రాభివృద్ధికి ముందుకొస్తున్న ఎన్ఆర్ఐల దగ్గర సీఎం జగన్ మోహన్ రెడ్డి.. జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ఆర్ఐల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జే ట్యాక్స్‌కు భయపడి ఎవరు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం లేదని ఆరోపించారు. మీరు వేసే ఓటుతో జగన్‌కి బుద్ధి రావాలన్నారు. ప్రవాసాంధ్రులను పరాయి బిడ్డలుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఆర్ఐల సేవలు వినియోగించుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఇదీ చదవండి