ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాజిల్లాలో ఘనంగా గోపూజ మహోత్సవం - మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో గోపూజ మహోత్సవ వేడుకలు

సంక్రాంతి పండగ మూడవ రోజైన కనుమను పురస్కరించుకుని.. కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారు, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో గోపూజ మహోత్సవం వేడుకగా నిర్వహించారు. గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.. దేవస్థాన అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

gopooja in krishna district
కృష్ణాజిల్లాలో గోపూజ వేడుకలు

By

Published : Jan 15, 2021, 3:46 PM IST

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో.. రాష్ట్రంలో గుడికి ఒక్క గోమాత అనే కార్యక్రమం చేపట్టారు. గోశాలలో ఇప్పటికే 20 వరకు ఆవులు ఉండగా.. ప్రజలు సుఖసంతోషాలతో, పాడి పంటలతో ఉండాలంటూ కనుమ రోజు ప్రత్యేకంగా వాటికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కడవకోళ్లు నరసింహారావుతో పాటు దేవస్థాన అధికారులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. కనుమ సందర్భంగా దేవాలయానికి చెందిన గోవులను ఆలయానికి తీసుకొచ్చి.. గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్​వీఎస్ఎన్ మూర్తితో పాటు ఇతర అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details