Goods Train Bogies Separated: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ గేటు సమీపంలో గూడ్స్ రైలు ఇంజిన్ వెనుక కొన్ని బోగీలు విడిపోయాయి. ఆ తరువాత ఇంజిన్ అర కిలోమీటర్ దూరం ముందుకెళ్లింది. గమనించిన లోకో పైలెట్ ఇంజిన్‌ను వెంటనే ఆపేశారు. ఈ విషయం తెలియడంతో.. బెల్లంపల్లి రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
రైలు వెళుతుండగానే వేరైన ఇంజిన్.. అర కిలోమీటర్ దూరంలో బోగీలు - Mancherial Goods Train Bogies Separated
Goods Train Bogies Separated: తెలంగాణ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ గేటు సమీపంలో గూడ్స్ రైలు ఇంజిన్ వెనుక కొన్ని బోగీలు విడిపోయాయి. ఇంజిన్ అర కిలోమీటర్ దూరం ముందుకెళ్లింది. దానిని గమనించిన పైలెట్లు రైలును వెంటనే ఆపేశారు.
రైలు వెళుతుండగానే వేరైన ఇంజిన్
సాంకేతిక సిబ్బంది బోగీలను ఇంజిన్‌కు అమర్చారు. చిన్న చిన్న మరమ్మతుల అనంతరం మళ్లీ గూడ్స్ రైలు ముందుకు కదిలింది. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల వ్యవధిలోనే ఓ ఎక్స్‌ప్రెస్ రైలు సాఫీగా వెళ్లిపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు బోగీలు ఎందుకు విడిపోయాయోనని అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి: