కృష్ణా జిల్లా విజయవాడ, గుణదల మూడు వంతెనల సెంటర్ ప్రాంతంలో స్థానిక గోసంరక్షణ సమితి సభ్యులు గోమాతకు సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గోవుకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం చీరలతో తమ ఇంటి ఆడబిడ్డకు చేసేలా తంతు జరిపారు. ఒక అమ్మాయికి చేసినట్లుగానే సీమంతం క్రతువును భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు.
గోమాతకు సీమంతం చేశారు..! - gomatha seemantham news in krishna district
భారతీయ సంప్రదాయంలో గోవును హిందువులు దైవంగా భావిస్తారు. కొందరు తమ ఇంటి బిడ్డలుగానూ భావిస్తారు. అలా గోమాతను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి కృష్ణా జిల్లాలో గో సంరక్షణ సభ్యులు ఆవుకు సీమంతం నిర్వహించారు. ఒక అమ్మాయికి చేసినట్లుగానే భక్తి శ్రద్ధలతో క్రతువు పూర్తి చేశారు.
gomatha seemantham in vijayawada