ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శంషాబాద్​ విమానాశ్రయంలో 9.2కిలోల బంగారం పట్టివేత - gold

తెలంగాణలోని శంషాబాద్​ విమానాశ్రయం ద్వారా అక్రమంగా బంగారం తరలింపు పరిపాటిగా మారింది. దుబాయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తికిని కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి 9.2 కిలలో పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్​ విమానాశ్రయంలో 9.2కిలోల బంగారం పట్టివేత

By

Published : Aug 10, 2019, 4:48 PM IST

తెలంగాణలోని హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి 3 కోట్ల 46 లక్షల 48 వేల రూపాయలు విలువ చేసే 9.2 కిలోల బంగారం పట్టుకున్నారు. రాత్రి దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రయాణికుడు వీ ఆకారంలో 4 బంగారం కడ్డీలను ఇస్త్రీ పెట్టెల్లో దాచుకుని లగేజ్‌లో తీసుకువస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేసి పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details