బంగారు దుకాణంలో చోరీ చేసేందుకు విఫలయత్నం
బంగారు దుకాణంలో చోరీకి యత్నం - latest robbery news in krishna district
కృష్ణా జిల్లా నూజివీడులోని ఓ జ్యూయలరీ షాప్‌లో చోరీ చేసేందుకు ముగ్గురు దుండగులు విఫలయత్నం చేశారు. స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన ఉన్న రాణి జ్యూయలరీ షాప్ గోడ పగలగొట్టేందుకు అర్ధరాత్రి సమయంలో ముగ్గురు దుండగులు యత్నించారు. కాంక్రీట్‌తో నిర్మించిన గోడ కావటంతో చోరీ ప్రయత్నం బెడిసికొట్టింది. షాప్ యజమాని ఫిర్యాదు చేయటంతో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు