సిగరెట్ కోసమని వచ్చి.. వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ.. - వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ న్యూస్
సిగరెట్ కోసమని వచ్చిన ఇద్దరు యువకులు చిల్లర దుకాణం నిర్వహిస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో జరిగింది.
సిగరెట్ కోసమని వచ్చి... వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ...
కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నానికి చెందిన శివనాగేంద్రమ్మ చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకడు సిగరెట్ ఇవ్వమని వృద్ధురాలిని అడగాడు. ఆమె ఇచ్చే లోపే వృద్ధురాలి మెడలోని గొలుసును లాక్కోని బైక్ పరారయ్యారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.