ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనంపై వచ్చి.. బంగారు గొలుసు చోరీ - krishna district latest news

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగులూరులో ఓ వృద్దురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అనంతరం ద్విచక్రవాహనంపై పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనంపై వచ్చి.. బంగారు గొలుసు చోరీ
ద్విచక్రవాహనంపై వచ్చి.. బంగారు గొలుసు చోరీ

By

Published : Aug 13, 2021, 10:39 PM IST

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామానికి చెందిన సుబ్బమ్మ.. అదే గ్రామంలో నివాసముంటున్న తన సోదరుడి ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి, సుబ్బమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించారు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు సుబ్బమ్మ ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details