కృష్ణా జిల్లా పామర్రు జమ్మిచెట్టు వీధిలో.. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను అడ్రస్ అడిగారు. ఆమె చిరునామా చెబుతుండగా దుండగులు మహిళ మెడలో నుంచి 20గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పట్టపగలే చోరీ జరగటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Theft: బైక్పై వచ్చి అడ్రస్ అడిగారు...ఆ తర్వాత.. - crime news in krishna district
కృష్ణా జిల్లా పామర్రులో దొంగతనం(theft) జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలోంచి బంగారు గొలుసు(gold chain)ను లాక్కొని పరారయ్యారు.
మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరణ