రోడ్డు నిర్మించే వరకు ఎన్నికలను బహిష్కరించి తీరుతామని కృష్ణా జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గోగులంపాడు కొత్తూరు ప్రజలు ఆందోళన బాట పట్టారు. రోడ్డు నిర్మిస్తామని.. ప్రతి ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు బూటకపు వాగ్దానాలు చేసి పబ్బం గడుపుకొంటున్నారని ఆగ్రహించారు.
రోడ్డు లేని కారణంగా.. వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా బురదమయంగా మారుతోందని.. దీంతో మహిళలు, విద్యార్ధులు అనేక ఇబ్బందురు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం చేసే వరకు ఎన్నికలను బహిష్కరిస్తామని, ఓటు వేసేది లేదని.. ఆంజనేయస్వామి గుడి సమీపంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.