ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి-కావేరీ అనుసంధానంపై వచ్చే నెలలో మరోసారి చర్చ

NWDA Meeting: గోదావరి - కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై వచ్చే నెల 15న జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) మరోసారి చర్చించనుంది. ఆ సంస్థ 70వ సర్వసభ్య సమావేశం దిల్లీలో జరగనుంది. భాగస్వామ్య రాష్ట్రాలతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తుండగా.. ఎజెండాలో కీలకాంశంగా గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టు ఉంది.

గోదావరి-కావేరీ అనుసంధానం
గోదావరి-కావేరీ అనుసంధానం

By

Published : Oct 26, 2022, 9:13 AM IST

NWDA Meeting: గోదావరి - కావేరీ నదుల అనుసంధానంపై వచ్చే నెల 15న మరోమారు జాతీయ స్థాయిలో చర్చ జరగనుంది. నవంబర్ 15న దిల్లీలో జరగనున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్​డబ్ల్యూడీఏ) 70వ గవర్నింగ్ బాడీ సమావేశం ఇందుకు వేదిక కానుంది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఎన్​డబ్ల్యూడీఏ అధికారులతో పాటు అన్ని రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు, ఈఎన్సీలు పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన ప్రణాళికలు, వాటి పురోగతిని సమావేశంలో చర్చిస్తారు.

గోదావరి-కావేరీ అనుసంధానానికి సంబంధించి ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యామ్నాయ ప్రతిపాదన ప్రస్తావనకు రానుంది. గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జల సంఘం తేల్చిన నేపథ్యంలో తన వాటాలో ఛత్తీస్​గఢ్​ వినియోగించుకోని నీటిని మాత్రమే కావేరీకి ఇచ్చంపల్లి నుంచి మళ్లిస్తామని జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై భాగస్వామ్య రాష్ట్రాలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. దీంతో వచ్చే నెలలో జరగనున్న గవర్నింగ్ బాడీ సమావేశంలో మరోమారు చర్చించనున్నారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details