విజయవాడలోని చిన్న కంచి దేవస్థానం ఆధ్వర్యంలో పోలవరం పట్టిసీమ కాలవ ఒడ్డున ఉన్న చంద్రశేఖరస్వామి స్నానాల ఘాట్లో గోదావరి నదికి పుణ్య హారతి కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన పండితులు నదిలో పుణ్యస్నానాలు చేసి అనంతరం గోదారమ్మకు హారతులు అందించారు. బిందెలతో నదీ నీటిని తీసుకొని చిన్న కంచి దేవస్థానంలోని వివిధ విగ్రహాలకు భక్తులు ఆభిషేకం నిర్వహించారు.
తొలి ఏకాదశి పర్వదినం... భక్తి పారవశ్యం - విజయవాడ
చిన్న కంచి దేవస్థానం ఆధ్వర్యంలో ఆషాడ తొలి ఏకాదశి సందర్భంగా... గోదావరి నదికి జలహారతి నిర్వహించారు. నదీ నీటిని తీసుకుని చిన్న కంచి దేవస్థానంలోని వివిధ విగ్రహాలకు జలాభిషేకం చేశారు.
తొలి ఏకాదశి సంబురాలు