కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ క్రాస్ రోడ్ వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న గొర్రెల మందపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లింది. నందిగామ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టిప్పరు అతి వేగంగా దూసుకెళ్లడంతో 14 గొర్రెలు రహదారిపై చిద్రమై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. చీకటి పడడంతో గొర్రెల కాపర్లు గొర్రెలను జాగ్రత్తగా రోడ్డు దాటిస్తూ వాహనాలను ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. టిప్పర్ డ్రైవర్ అతి వేగంగా దూసుకు రావడంతో మూగజీవాల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. 14 మూగజీవాలు మృతి - accident news in krishna district
రోడ్డు దాటుతున్న గొర్రెల మందపైకి టిప్పర్ లారీ అతివేగంగా దూసుకెళ్లింది. ప్రమాదంలో 14 మూగజీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది.
goats death