TDP leaders Bhogi Celebrations Across the state: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులంతా జీవో నెెం1 ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చేశారు. అలాగే సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అని నినాదాలు చేస్తూ భోగి వేడుకలు జరుపుకున్నారు. జిల్లాల వారీగా నాయకుల స్పందన ఇలా ఉంది.
ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఇంచార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం వద్దకు వేకువజామునే చేరుకుని భోగిమంటలతో సంక్రాంతి పండగకు స్వాగతం పలికారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పార్టీ శ్రేణులు భోగిమంట వేశారు. యర్రగొండపాలెం టీడీపీ ఆధ్వర్యంలోనూ భోగి వేడుకలు నిర్వహించారు.
కడప జిల్లాలో ప్రతిపక్షాలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జీవో నెంబర్ ఒకటిని సైతం కోర్టు తప్పు పట్టిందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన చీకటి జీవో నెంబర్ ఒకటిని ప్రతులను కడప కోటిరెడ్డి కూడెలి వద్ద భోగిమంటల వేసి దగ్ధం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.
అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం..రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ద్వారా సంక్రమించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది విఘాతం. అన్నారు.. జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయం.. ప్రభుత్వం బే షరతుగా ఈ జీవోను ఉపసంహరించు కోవాలని పీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి అన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లాధర్మవరం పట్టణంలో భోగిమంటల్లో టీడీపీ నేతలు జీవో నెంబర్ 1 ప్రతులను దగ్ధం చేశారు. గాంధీనగర్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ ఒకటి ప్రజలను దగ్ధం చేశారు. మూడు రాజధానులు వద్దని, సైకో పాలన పోవాలని నినాదాలు చేశారు. హిందూపురం పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు.
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు జీవో నెంబరు ఒకటి కాపీ పత్రాలను భోగి మంటల్లో వేసి తగుల పెట్టారు. తాడేపల్లిలో ఆ పార్టీ నేతలు జీవో నెంబరు 1 పత్రాలను భోగి మంటల్లో వేశారు. సైకో పోవాలని.....సైకిల్ తిరిగి రావాలంటూ నినాదలు చేశారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలను అమల్లోకి తీసుకువచ్చి ప్రజాస్వామ్య గొంతును నొక్కాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు జీవో నెంబర్ కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు.
ఎన్టీఆర్ జిల్లానందిగామ మండలం సోమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ ఒకటి కాపీలను భోగిమంటల్లో దగ్ధం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ఆధ్వర్యంలో కాపీలను భోగిమంటల్లో వేసి తగలబెట్టారు. అలాగే జగ్గయ్యపేటలో కూడా జీవో నెం1 ప్రతులను టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ తాతయ్య భోగిమంటల్లో వేసి దహనం చేశారు.
వైఎస్సార్ జిల్లాలో..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం జీవో నెం1ని తీసుకొచ్చారని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్‌రెడ్డి విమర్శించారు. సంక్రాంతి సందర్బంగా శనివారం జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామంలో పర్యటించారు. కార్యక్రమానికి హాజరై భోగి మంటల్లో జీవో నెంబర్ ఒకటి ప్రతులను దహనం చేశారు.
అద్దంకి పట్టణంలో పలుచోట్ల భోగి మంటలు భారీగా వేశారు. భోగ మంటలు వేసే సమయంలో యువకులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో వేసిన భోగి మంటలలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవో ప్రతులను దగ్ధం చేశారు. దర్శి టీడీపీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. మాజీ ఎమ్మెల్యే పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవో ప్రతులను భోగి మంటల్లో వేశారు.
బాపట్ల జిల్లా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు పోయాయని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరులోని ఎన్టీఆర్ పుర వేదిక వద్ద నిర్వహించిన భోగి వేడుకలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అంటూ నినాదాలు చేశారు. జగన్ దుర్మార్గపు పాలనలో వస్తున్న జీవోలు అన్ని నశించాలని ఆనందబాబు అన్నారు.
అనంతపురం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగిమంటల్లో జీవో నెంబర్ వన్ ప్రతులు దగ్ధం చేశారు. రాయదుర్గం పట్టణంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు జీవో నెంబర్ ొ ప్రతులను భోగిమంటల్లో వేసి కాల్చివేశారు.