భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జీఎంఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాలవలవన్, జీఎంఆర్ ఛైర్మన్ జీబీఎస్ రాజు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఎయిర్ పోర్టునుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖనగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటు చేస్తామన్నారు.