ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పామర్రులో ఘనంగా ఘంటసాల జయంతి - పామర్రులో పద్మశ్రీ ఘంటసాల జయంతి వేడుకలు నిర్వహించిన పలు కళాసంఘాలు

పద్మశ్రీ ఘంటసాల 98వ జయంతి ఉత్సవాలు.. కృష్ణాజిల్లా పామర్రు మండలంలో ఘనంగా జరిగాయి. వివిధ కళాసంఘాలు పాటలు, నృత్యాలతో ప్రేక్షకులను అలరించాయి.

ghantasala jayanti
ఘంటసాల జయంతి వేడుకలు

By

Published : Dec 4, 2020, 9:20 PM IST

ఘంటసాల జయంతి వేడుకలు

కృష్ణా జిల్లా పామర్రులో పద్మశ్రీ ఘంటసాల 98వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ ఘంటసాల, ఎస్పీ బాలు స్మారక సంగీత పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గాన గంధర్వుడు ఘంటసాల పాటలను కళాకారులు ఆలపించారు.

నటరాజ నృత్య నికేతన్ విద్యార్ధులతో నిర్వహించిన నృత్య ప్రదర్శన.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పామర్రు ఎన్టీఆర్ సర్కిల్​లో.. ది పామర్రు కళాపరిషత్ ఆధ్వర్యంలోనూ ఘంటసాల జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల బసవయ్య భగవద్గీత ఉపన్యాసం ప్రజలను అలరించింది.

ABOUT THE AUTHOR

...view details