మన విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. దీనిపై వివిధ సంస్థలకు, నగరవాసులకు విస్తృతంగా నగరపాలక సంస్థ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ నగరపాలక సంస్థ, కృష్ణా జిల్లా అధికారులు రాజపత్రాన్ని విడుదల చేశారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నగరంలో ప్లాస్టిక్ తయారుచేయుట, నిల్వ, సరఫరా, రవాణా, అమ్మకం పూర్తిగా నిషేధం. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు రాజపత్రంలో వెల్లడించారు. పదిహేను రోజుల తర్వాత నుంచి ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నట్లు గెజిట్ లో పేర్కొన్నారు.
విజయవాడలో ప్లాస్టిక్ అస్సలు వాడొద్దు!
విజయవాడను స్వచ్ఛ నగరంగా తయారు చేయాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు, నగరపాలక సంస్థ మన విజయవాడ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్వచ్ఛ విజయవాడ